|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 01:34 PM
శుక్రవారం అనగా నిన్న ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచర్లమోటు వద్ద కారు-లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు బాపట్ల జిల్లా స్టూవర్టుపురంకు చెందిన వారు మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్ళుండగా మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలానే నేడు కడప జిల్లాలో జరిగిన ప్రమాదంపై కూడా అయన దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
Latest News