రక్షణ కల్పించాల్సిన పోలీసులు హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం?
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 01:33 PM

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో బరితెగించి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శిశుపాలుని మాదిరి పాపాలు చేస్తున్నారని, వీటిని ప్రజ­లు ఎంత మాత్రం క్షమించరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామా­నికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ పట్ల దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘ఎక్స్‌’ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ స్పందిస్తూ..... ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? హరికృష్ణపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచి పెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతడిని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయ­డం కాదా? చంద్రబాబూ.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని ఆ పోస్ట్‌లో వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.    

Latest News
Late Bellerin goal all but ends Real Madrid's La Liga title hopes Sat, Apr 25, 2026, 10:29 AM
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM