మారిషస్‌, బ్రిటన్ కీలక ఒప్పందం.. దశాబ్దాల వివాదానికి చెక్
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 08:17 PM

మారిషస్‌, బ్రిటన్ కీలక ఒప్పందం.. దశాబ్దాల వివాదానికి చెక్

దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి చెక్ పెడుతూ.. బ్రిటన్ చాగోస్ దీవుల పరిపాలనా హక్కులను మారిషస్‌కు అధికారికంగా బదిలీ చేసే ఒప్పందానికి గురువారం అంగీకరించింది. ఈ ఒప్పందం కింద మారిషస్‌కు బ్రిటన్ ఏటా సుమారు 101 మిలియన్ పౌండ్లు (రూ. 1,160 కోట్లకు పైగా) చెల్లిస్తూ.. డియేగో గార్షియా దీవిలోని కీలక సైనిక స్థావరాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ స్థావరం ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సంయుక్తంగా నిర్వహించే సైనిక కేంద్రంగా పనిచేస్తోంది. నిఘా సమాచార సేకరణ, తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ మాట్లాడుతూ.. మన దేశ భద్రతకు డియేగో గార్షియా స్థావరం కీలకంగా మారింది. ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా భవిష్యత్ తరాల భద్రతను సుస్థిరం చేసుకుంటున్నాం’ అని తెలిపారు.


భారత ప్రభుత్వం మద్దతు


ఈ పరిణామంపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ ఒప్పందాన్ని ఒక ‘చారిత్రాత్మక విజయం’గా అభివర్ణించింది. ‘చాగోస్ దీవులపై బ్రిటన్-మారిషస్ ఒప్పందం ద్వారా మారిషస్‌కు పరిపాలనా హక్కులు తిరిగి బదలాయించడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించే దిశగా ముఖ్యమైన అడుగు’" అని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘ఎప్పటినుంచో చాగోస్ దీవులపై మారిషస్ న్యాయబద్ధమైన హక్కులకు భారత్ మద్దతు ఇస్తోంది. ఈ ఒప్పందం వలసపాలన నుంచి విముక్తి లక్ష్యానికి అనుగుణంగా ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మారిషస్‌తో కలిసి శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్ పనిచేస్తుంది’ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.


చాగోస్ దీవుల నేపథ్యం


చాగోస్ దీవులు: మాల్దీవులకు దక్షిణాన, భారత తూర్పు తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రంలో ఉన్న 60కి పైగా చిన్నదీవుల సమాహారం.


చరిత్ర: 1814లో నెపోలియన్ యుద్ధాల తర్వాత బ్రిటన్ ఈ దీవులను ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకుంది. 1965లో మారిషస్‌కు స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందు దీవులను వేరు చేసింది. అందుబాటులో ఉన్న సిబ్బంది: డియేగో గార్షియాలో సుమారు 2,500 మంది సైనిక సిబ్బంది ఉనికి ఉండగా... వీరిలో మెజారిటీ అమెరికా సిబ్బంది. 2008లో ఈ స్థావరాన్ని ఉగ్రవాద అనుమానితుల రహస్య రవాణా కోసం వాడినట్టు అమెరికా అంగీకరించింది.


ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్ తన స్వరాజ్యాధికారం తగ్గించుకుంటూ మారిషస్‌కు న్యాయం చేస్తున్నప్పటికీ, చైనా ప్రభావం, భారీ ఆర్థిక భారం వంటి అంశాలపై బ్రిటన్ లోపల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఇది అంతర్జాతీయంగా వలస పాలన నుంచి విముక్తి అంశాన్ని మరింత బలపరచే పరిణామంగా భావిస్తున్నారు.


యూకే పౌరుల నుంచి భారీ వ్యతిరేకత నేపథ్యంలోనే బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే, ఖచ్చితమైన ఖర్చుల వివరాలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. మరోవైపు, మారిషస్‌కు చైనాతో ఉన్న బలమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు కెమీ బడెనాక్ ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రధాని కియర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం ‘బ్రిటిష్ భూభాగాన్ని అప్పగించడమే కాకుండా ప్రజలపై భారీ ఆర్థిక భారం మోపుతోంది’ విమర్శించారు.

Latest News
3rd Test: Sachin Tendulkar rings iconic five-minute bell at the start of Lord's Test Thu, Jul 10, 2025, 04:57 PM
Flood alert issued across several districts in Nepal Thu, Jul 10, 2025, 04:56 PM
Manipur: Congress urges Governor to rehabilitate violence-hit displaced people soon Thu, Jul 10, 2025, 04:53 PM
Law college rape: Kolkata Police SIT submits report to HC; victim's parents happy with probe's progress Thu, Jul 10, 2025, 04:51 PM
Indian stock market ends lower ahead of Q1 earnings Thu, Jul 10, 2025, 04:49 PM