భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు శాటిలైట్ సపోర్ట్
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 08:16 PM

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు శాటిలైట్ సపోర్ట్

పాకిస్తాన్ మరోసారి చైనా ఉచ్చులో పడుతోంది. ఇటీవల భారత్ చేసిన దాడులను అడ్డుకునేందుకు.. భారత్‌పై దాడులు చేసేందుకు.. చైనా ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్‌లు ఉపయోగించుకున్న పాకిస్తాన్ బొక్క బోర్లా పడిన సంగతి ప్రపంచం మొత్తం చూసింది. మేడిన్ చైనా వస్తువులతో యుద్ధం చేసినందుకు.. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిపిన దాడుల్లో పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా లాహోర్‌లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు స్తంభించిపోవడం, 8 పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై భారత్ కచ్చితమైన దాడులు నిర్వహించి.. ధ్వంసం చేసిన కొన్ని రోజులకే.. పాకిస్తాన్ చైనా మిలటరీ అధికారులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ సైన్యానికి చైనా.. తన బీడౌ శాటిలైట్ సిస్టమ్ అందుబాటును మరింత బలోపేతం చేయడానికి చైనా, పాకిస్తాన్ మిలిటరీ అధికారులు మే 16వ తేదీన వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు.


రెండు దేశాల మిలిటరీ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ కవరేజీ పరంగా మద్దతును పెంచడంతోపాటు.. భారత కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌కు సమాచారం అందించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. రియల్ టైమ్ కో ఆపరేషన్, నిఘా సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి 5జీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ల ఇంటిగ్రేషన్‌పై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.


ఇక ఇటీవల భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో కూడా పాకిస్తాన్‌కు చైనా ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ కవరేజీని అందించినట్లు సమాచారం. అయితే చైనా సైనిక హార్డ్‌వేర్, సిస్టమ్‌ల సహాయం ఉన్నప్పటికీ.. భారత ఆర్మీ చేతిలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని చవిచూడటం గమనార్హం. అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత్‌పై చేసిన దాడుల్లో చైనా తయారు చేసిన ఫైటర్ జెట్లు, మిసైల్ సిస్టమ్‌లను ఉపయోగించాయి. అయితే వాటిని ఎదుర్కొనేందుకు భారత దళాలు స్వదేశీ ఆయుధ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడ్డాయి. భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను కూడా మోహరించింది.


ఇందులో భాగంగానే ముఖ్యమైన పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు, యుద్ధ విమానాలను నిర్వీర్యం చేశాయి. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ స్థానాలపై భారత సైన్యం బలమైన దాడులను ప్రారంభించింది. ఇందులో చైనీస్ జెట్లు, క్షిపణి వ్యవస్థలతో కూడిన పాకిస్తాన్ రక్షణ ఆయుధాగారం తమ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరోవైపు.. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైనికుల కదలికలు, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ సుమారు 10 శాటిలైట్లను మోహరించింది. అవి అందించిన సమాచారం ఆధారంగా.. భారత భద్రతా బలగాలకు వ్యూహాత్మక ఆధిక్యాన్ని ఇచ్చింది.

Latest News
Proclaimed offender involved in 110 cases nabbed by Delhi Police Wed, Jul 23, 2025, 04:01 PM
KFC and Pizza Hut India operator Sapphire Foods' slips into loss of Rs 1.73 crore in Q1 Wed, Jul 23, 2025, 03:55 PM
Third round of Russia-Ukraine peace talks set to begin in Istanbul Wed, Jul 23, 2025, 03:42 PM
Patna hospital murder: Key accused changed appearance, tried to hoodwink cops Wed, Jul 23, 2025, 03:27 PM
Ukraine loses French Mirage 2000 fighter jet in crash Wed, Jul 23, 2025, 03:02 PM