1/2019 సర్క్యులర్‌ పునరుద్ధరించనున్న ప్రభుత్వం
 

by Suryaa Desk | Fri, May 23, 2025, 06:45 PM

ఏపీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన కీలకమైన 1/2019 సర్క్యులర్‌ను పునరుద్ధరిస్తూ కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో దాదాపు 48 వేల మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది.గతంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల విషయంలో ఈ సర్క్యులర్ మార్గదర్శకంగా ఉండేది. అయితే, దీనిని పక్కన పెట్టడంతో చిన్నచిన్న పొరపాట్లకు కూడా కఠినమైన శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ వచ్చాయి. ముఖ్యంగా, 1/2019 సర్క్యులర్‌ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) ఆధ్వర్యంలో ఉద్యోగులు ఇటీవల ఆందోళనలు కూడా నిర్వహించారు.ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఎన్‌ఎంయూ నాయకులతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా, ఉద్యోగులు చేసే చిన్న తప్పిదాలకు కూడా తీవ్రమైన శిక్షలు విధిస్తున్నారని, ఇది సరికాదని యూనియన్ నేతలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం, ఇకపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా 1/2019 సర్క్యులర్‌లోని నిబంధనలను పాటించాలని స్పష్టం చేస్తూ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఈ సర్క్యులర్‌ను అనుసరించాలని ఆదేశాల్లో పేర్కొంది.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM