![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:37 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేపట్టారు. మంగళవారం నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సైతం ఒకరోజు సమ్మె చేపట్టారు. ఉద్యోగులకు నోటీసులు.. కార్మికుల తొలగింపునకు నిరసనగా విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలన్న డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగారు.
Latest News