![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 08:40 PM
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన విశ్లేషణలతో ఎంత సూటిగా ఉంటారో, అంతే చమత్కారంగా కూడా మాట్లాడతారన్న విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన చేసిన కొన్ని సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి.ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ మయంతి లాంగర్‌తో పాటు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, సునీల్ గవాస్కర్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో మయంతి లాంగర్ దుస్తులకు సరిపోయే రంగులో గవాస్కర్ ప్యాంటు ధరించిన ఉదంతం ఓ ఫేమస్ మీమ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని గుర్తుచేస్తూ, గవాస్కర్ మరో సరదా మీమ్‌కు ఆస్కారం కల్పించారు.కార్యక్రమంలో రాబిన్ ఉతప్పను ఉద్దేశించి, "మయంతి ప్యాంటును ఊతప్ప ఎందుకు వేసుకున్నాడు అని గవాస్కర్ నవ్వుతూ ప్రశ్నించారు. దానికి ఉతప్ప, "మీ నుంచి దృష్టి మరల్చడానికే" అని అంతే సరదాగా బదులిచ్చారు. గవాస్కర్ వెంటనే, "నిజానికి ఆ ప్యాంటు నేను వేసుకోవాల్సింది" అనడంతో నవ్వులు విరిశాయి. ఈ సంభాషణలో మయంతి కూడా కలుగజేసుకుంటూ, "ఈరోజు మా స్టైలిస్ట్ మీ ఇద్దరి మధ్య కాకుండా, నాకూ రాబిన్‌కూ సంభాషణ సెట్ చేశారు. దీన్ని స్క్రీన్ షాట్ తీసి, కొత్త మీమ్ చేయండి. కానీ, సన్నీ జీ మీ పరిశీలన అద్భుతం అని వ్యాఖ్యానించారు.
Latest News