డిస్ట్రాయర్ యుద్ధనౌక జలప్రవేశంలో అపశృతి
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 08:09 PM

ఉత్తర కొరియాలో బుధవారం ఓ నూతన డిస్ట్రాయర్ యుద్ధనౌక జలప్రవేశ కార్యక్రమం అపశ్రుతితో ముగిసింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనతో ఉత్తర కొరియా నౌకాదళ విస్తరణ ప్రణాళికలకు ఆరంభంలోనే కొంత ఆటంకం ఏర్పడినట్లయింది. సిబ్బంది అనుభవరాహిత్యంతో కూడిన కమాండ్, కార్యాచరణలో నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం కారణంగా యుద్ధనౌకలోని కీల్ (నౌక కింది పొడవైన భాగం) కొన్నిచోట్ల ధ్వంసమైందని, నౌక ముందు భాగం షిప్‌వే నుంచి బయటకు రాలేకపోయిందని కేసీఎన్ఏ తన నివేదికలో పేర్కొంది. దీంతో నౌక జలప్రవేశం నిలిచిపోయింది.ఈ ‘బాధ్యతారహితమైన తప్పిదాలకు’ పాల్పడిన వారిపై వచ్చే నెలలో జరగనున్న పార్టీ సెంట్రల్ కమిటీ ప్లీనరీ సమావేశంలో కఠిన చర్యలు తీసుకుంటామని కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించినట్టు సమాచారం. అంతేకాకుండా, దెబ్బతిన్న యుద్ధనౌకకు జూన్ లోగా మరమ్మతులు పూర్తి చేసి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

Latest News
Maitri Parv celebrates friendship, shared history between India and Oman: PM Modi Thu, Dec 18, 2025, 02:29 PM
'Op Sindoor showcased India’s swift, high-impact air power': Rajnath Singh Thu, Dec 18, 2025, 02:24 PM
Indian community in Oman excited to meet PM Modi Thu, Dec 18, 2025, 02:23 PM
Vijay calls DMK 'destructive power' at Erode rally, says TVK force of purity Thu, Dec 18, 2025, 01:51 PM
Assam CM condoles death of veteran sculptor Ram Sutar Thu, Dec 18, 2025, 01:39 PM