|
|
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:25 PM
కరోనా నేపథ్యంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోడానికి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రభుత్వం తరపున ఏర్పాటుచేయాలని గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని భరత్ చెప్పారు. ఇందులో భాగంగా రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ మొదటి ఫేజ్ లోనే తీసుకొచ్చి ఎకడమిక్ కూడా స్టార్ట్ చేయించామని, మొదటి ఏడాది పూర్తయి రెండవ ఏడాదిలోకి కాలేజీ అడుగుపెట్టిందని ఆయన అన్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ లను కూడా తీసుకొచ్చిందన్నారు. అప్పట్లో కేంద్రానికి మన ఎంపీల మద్దతుతో పనిలేకున్నా సరే, పోరాడి సాధించామని అయితే ప్రస్తుతం కేంద్రం మన ఎంపీలపై ఆధారపడినప్పటికీ ఎందుకు సాధించలేకపోతున్నారని భరత్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పారని, మరి ఆ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అప్పులు చేసుకుంటూ పోతూ కూడా సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదని భరత్ విమర్శించారు.
Latest News