కెంపెగౌడ విమానాశ్రయాన్ని సందర్శించిన సీఎం
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 01:34 PM

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్‌-2ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సందర్శించారు. విమానాశ్రయ సీఈవో హరి మారర్‌తో కలిసి టెర్మినల్‌-2లో సౌకర్యాలపై దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ విశేషాలను ఆయన ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ‘టెర్మినల్‌ -2ను సహజ వాతావరణం మధ్య అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. విమానాశ్రయంలో సహజ ఉద్యానవనాన్ని భాగంగా చేయడం ఆకట్టుకుంటోంది. విమానాశ్రయాన్ని మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ హబ్‌గా తీర్చిదిద్దడం అద్భుతం’ అని చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న తన ఆలోచనకు ఈ సందర్శన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

Latest News
'India and South Korea to move forward as steadfast partners in building future together' Tue, Apr 21, 2026, 03:08 PM
UN Security Council condemns killing of peacekeeper in Lebanon Tue, Apr 21, 2026, 03:03 PM
IPL 2026: CSK batter Ayush Mhatre ruled out due to hamstring injury Tue, Apr 21, 2026, 03:00 PM
Adani Power's arm sets up new atomic energy subsidiary Tue, Apr 21, 2026, 02:57 PM
IT Dept flags discrepancies in Udhayanidhi's poll affidavits, Madras HC adjourns case Tue, Apr 21, 2026, 02:57 PM