డెయిరీ యూనిట్ ఏర్పాటుకు నిధులు మంజూరు
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 01:13 PM

కొండపిలో డెయిరీ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 5 కోట్లు నిధులు మంజూరైనట్లు రాష్ట్ర మారి టైమ్ బోర్డు డైరెక్టర్ దామచర్ల సత్య తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏపిఎం గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ, నియోజకవర్గం పరిధిలో మొత్తం రెండు డెయిరీ యూనిట్లను మంజూరు చేశామని, వాటిలో ఒకటి కొండపిలో, మరొకటి సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ డెయిరీ యూనిట్ల ద్వారా స్థానిక రైతులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయనీ, పశుపాలనకు తోడ్పాటుగా ఉంటాయనీ ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Latest News
Calcutta HC reprimands EC over imposing restrictions on bike movement before Bengal polls Thu, Apr 23, 2026, 04:25 PM
Pakistan cannot even guarantee safe vaccination for its children: Report Thu, Apr 23, 2026, 04:23 PM
Plastic particles may trigger liver disease risk: Researchers Thu, Apr 23, 2026, 04:21 PM
Ship movement via Hormuz halts, global oil prices firm up Thu, Apr 23, 2026, 04:15 PM
Nuwan Thushara withdraws IPL NOC case against SLC Thu, Apr 23, 2026, 03:47 PM