![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:35 AM
వైశాఖ మాసంలో క్రిష్ణ పక్ష దశమి తిథినాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. శ్రీరామ భక్తుడైన హనుమంతుడిని ఆరాధిస్తే పాపాలు తొలగి, విముక్తి లభిస్తుందని.. అలాగే భయం తొలగి బలం, ధైర్యం పెరుగుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 22 గురువారం నాడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ రోజున హనుమాన్ విగ్రహాలతో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు.ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. వాతావరణం అనుకూలించినప్పటికీ స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున హనుమాన్ మాల దారులు భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. భారీగా హనుమాన్ భక్తుల రాకతో కొండగట్టు జై హనుమాన్ జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతుంది. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భద్రాచల ఆలయం నుండి వచ్చిన పట్టు వస్త్రాలతో పాటు పూలు పండ్ల తో అలంకరించారు.
Latest News