|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:31 PM
కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ అధినేతను కలిశారు. ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను ఆయనకు వివరించారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం వివరాలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రాజ్యాం్గగానికి తూట్లు పొడుస్తూ ఖూఈ చేస్తోందని మండిపడ్డారు. మెజారిటీలు లేక పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న కూటమి వర్గాలు బరితెగించారని ధ్వజమెత్తారు. టీడీపీకి మెజారిటీలు లేక పోయినా అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఒక సంవత్సరం పూర్తి అయిందని, మిగిలిన ఏళ్లు కూడా కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగాను, ధైర్యంగాను ఎదుర్కొందామని వారికి సూచించారు. కార్యకర్తలు, నాయకులు ఎక్కడా తమ ధైర్యాన్ని కోల్పోవద్దని, కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరో ఇచ్చారు. చట్టపరంగా, న్యాయపరంగా శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పెట్టి ఇబ్బందులను, సమస్యలను తట్టుకుని పార్టీ కోసం నిలబడినందుకు కౌన్సిలర్లందరికీ హాట్సా‹ఫ్ చెప్పారు.
Latest News