|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:28 PM
గుంటూరు జిల్లా ఉండవల్లిలో ‘యోగాంధ్ర’ వెబ్‌సైట్‌ను ప్రారంభించి సీఎం చంద్రబాబు, జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నామని అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సీఎం తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లమంది యోగాలో పాల్గొనేలా సంకల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు.
Latest News