|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:25 PM
రాష్ట్రంలో పేదలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. ఎంత ఖర్చయినా మహిళలకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారన్నారు. ఈ దసరా నాటికి పేదలకు టిడ్కో ఇళ్లను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలంటే రూ.7వేల కోట్లు కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి వాటిని పక్కదారి పట్టించారు. 2014-19 మధ్య ప్రతిపాదించిన 7లక్షల టిడ్కో ఇళ్లు అవి వైసీపీ హయాంలో ఆగిపోయాయని స్ఫష్టం చేశారు.ప్రతి ఇంటికి నీరిచ్చేలా 2021లో అమృత్ పథకం కోసం కేంద్రం నిధులిస్తే వైకాపా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి మళ్లీ నిధులు వచ్చేలా చేశారు. రూ. 834 కోట్ల పనులు అమృత్ పథకం కోసం నిర్దేశించాం. కొద్ది నెలల్లో అమృత్ పథకం ద్వారా సర్ఫేస్ వాటర్ వస్తాయి. విశాఖ మెట్రోకి సంబంధించి అక్టోబర్ నెలలో పనులు మొదలుపెడతాం. డబుల్ డెక్కర్ మెట్రో కింద డీపీఆర్ ఇచ్చాం. కోటి మంది ప్రజలు ఉన్న హైదరాబాద్‌కు రింగురోడ్డు ఉంది. అదే తరహాలో విశాఖలో సెమీ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం’’అని మంత్రి నారాయణ తెలిపారు.
Latest News