|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:25 PM
దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21వ తేదీన విశాఖ సాగర తీరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్జి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తదితర ఉన్నతాధికారులతో కలిసి హోంమంత్రి అనిత బీచ్ రోడ్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికారులు పూర్తి సమన్వయంతో, సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు.
Latest News