|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:25 PM
కొవిడ్ మహమ్మారి పలు రకాలుగా రూపాంతరం చెందుతోంది. ఒక్కో వేరియంట్ ఒక్కో విధంగా ప్రజల ప్రాణాలను హరించి వేస్తోంది. చైనాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా కేసుల్లో మరో కొత్త వేరియంట్ బయటపడినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ 8 ఏళ్ల చిన్నారి మృతితో ఈ కొత్తరకం వైరస్ గురించి ఆరోగ్య నిపుణులకు అర్థమైంది. చైనాలో ఓ 8 ఏళ్ల చిన్నారి కొవిడ్-19 వైరస్ తో మృతి చెందింది. ఆ చిన్నారి మెదడులోకి కరోనా వైరస్ వెళ్లింది. దీంతో ఆ పాప చావుకు ముందు కోమాలోకి వెళ్లిపోయింది. అలా కొద్దిరోజులకు మృతి చెందింది. దీంతో ఇదో అరుదైన వేరియంట్ గా అక్కడి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వైద్యులు తెలిపిన ప్రకారం.. ఆ చిన్నారికి మొదట జ్వరం వచ్చింది. చర్మంపై దురదలు,కాళ్లు, చేతులపై దురదలు వచ్చాయి. తలనొప్పి తీవ్రంగా ఉంది. వాంతులు చేసుకుంది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె బ్రెయిన్ లోకి కొవిడ్ వైరస్ వెళ్లినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు ఆమె కాళ్లు చేతులు వంకర్లు తిరిగాయని వైద్యులు పేర్కొన్నారు. కొవిడ్- 19 సోకడం వల్ల ఆమె అరుదైన బ్రెయిన్ డిసార్డర్ బారిన పడినట్లు తెలిపారు. చిన్నారికి చైనాలోని గువాంగ్ జో వుమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసి నిర్థారించారు. ఎక్యూట్ నెక్రోటైసింగ్ ఎన్ సెఫలోపతి(ANE) అనే బ్రెయిన్ డిజార్డర్ కారణంగా చిన్నారి కోమాలోకి వెళ్లినట్లు అభిప్రాయానికి వచ్చారు. కొవిడ్ 19 సోకడంతోనే ఈ బ్రెయిన్ డిజార్డర్ వచ్చినట్లు తెలిపారు. కొవిడ్ వైరస్ మెదడులోకి వెళ్లడం ద్వారా న్యూరో సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్యులు భావిస్తున్నారు. గువాంగ్ జో వుమెన్ అండ్ చిల్డ్రన్ మెడికల్ ఆస్పత్రి వైద్యులు.. ప్రస్తుతం చిన్నారులకు కొవిడ్ నుంచి రక్షణ అనే అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
Latest News