రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పింది అందుకేనా?
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 03:50 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకస్మికంగా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం విదితమే. రోహిత్ శర్మ ఆకస్మిక రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని, అందుకే రోహిత్ ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే రోహిత్ రిటైర్మెంట్‌పై తాజాగా ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ స్కై స్పోర్ట్స్ సంచలన నివేదికను వెలుగులోకి తీసుకువచ్చింది.ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా తనను ఎంపిక చేయాలని, టూర్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి రోహిత్ తెలియజేశాడని, అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం రోహిత్‌ను కేవలం ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేస్తామని, కెప్టెన్‌గా వేరే ఆటగాడికి అవకాశం ఇస్తామని చెప్పిందని సదరు వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ పరిణామ క్రమంలోనే రోహిత్ శర్మ అనూహ్యంగా తన కేరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Latest News
Experts look for CDV outbreak source after big cat family of 5 wiped out in Kanha Tiger Reserve Fri, May 01, 2026, 03:45 PM
CBI arrests additional director of CGHS Meerut, aide for taking Rs 50,000 bribe Fri, May 01, 2026, 03:44 PM
IPL 2026: RCB could've won by taking wickets not by defending runs, says Bhuvneshwar Fri, May 01, 2026, 03:04 PM
'Democracy under threat': Pramod Tiwari on Kolkata strongroom row Fri, May 01, 2026, 02:58 PM
Mamata Banerjee has 'panicked' before poll results: BJP MPs on Bengal CM's strong room visit Fri, May 01, 2026, 02:55 PM