|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:34 PM
అమెరికాలో హెల్త్-టెక్ స్టార్టప్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30) దారుణ హత్యకు గురయ్యారు.
ఈ నెల 14న టెక్సాస్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా, ఆయన వెనక కూర్చున్న దీపక్ కండేల్ దాడి చేసి హతమార్చాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. అక్షయ్ పెన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేసి, ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓను కలిశారు.