|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 11:51 AM
యోగా డే సందర్బంగా జూన్ 21న విశాఖకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనిత. అలాగే అధికారులతో కలిసి బీచ్ రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసారు మంత్రి.అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గోనే వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు వివిధ అంశాలపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే ప్రధాన వేదిక వద్ద 5లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని యోగాసనాలు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Latest News