|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 11:46 AM
ప్రజా పంపిణీ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలు వ్యవస్థను రద్దుచేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జూన్ 1 నుంచి లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిశ్చయించింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం ఇంటికే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. దీపం ఫేజ్-3లో ఉచిత గ్యాస్ సిలెండర్ల రాయితీ సొమ్మును ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. జూన్ ఒకటో తేదీ నుంచి గతంలో మాదిరిగానే చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎండీయూ వాహనాలను ఉచితంగా వాటి లబ్ధిదారులకే బదలాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Latest News