|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 11:37 AM
పాకిస్తాన్ తరఫున గూఢచర్యం ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టైన విషయం తెలిసిందే. ఆమె వ్యక్తిగత డైరీలో “ఐ లవ్ యూ” అనే వాక్యం, “సవితా” అనే పేరు ఉంది. 'సవితా పండ్లు తీసుకురా', 'సవితా ఇంటిని జాగ్రత్తగా చూసుకో'. 'చాలా త్వరగా తిరిగి రావలి' వంటి విషయాలతో పాటు.. కొన్ని మందుల పేర్లు కూడా రాసి ఉన్నాయి. సవిత ఎవరు..?, ఈ సమాచారంతో గూఢచర్యానికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.‘‘నిందితురాలిని విచారించేందుకు ఎన్‌ఐఏ బృందం ఇక్కడికి వచ్చింది’’ అని హిస్సార్ ఎస్పీ శశాంక్‌కుమార్ సావన్ మీడియాకు వెల్లడించారు. ‘‘ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం 2018లో ఆమెకు పాస్‌పోర్టు వచ్చింది. 2028 వరకు దానికి గడువు ఉంది. పాస్‌పోర్టు వచ్చినప్పటినుంచి ఆమె పాకిస్థాన్, చైనా, దుబాయ్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండోనేసియాల్లో ప్రయాణించింది. ఆ పర్యటనల గురించి సమాచారం సేకరిస్తున్నాం’’ అని ఓ అధికారి వివరాలు వెల్లడించారు.పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్ (Spy Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో ఐదుగురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Latest News