|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 11:35 AM
ఆయనో ప్రముఖ వైద్యుడు. వయసు 70 సంవత్సరాలు. వయసు పైబడుతున్నా చదువుపై మమకారం తగ్గలేదు. మానసిక వైద్యుడిగా రోగులకు సేవలు అందిస్తూనే 61 కోర్సులు పూర్తి చేసేశారు. ఆయనెవరో కాదు.. రాష్ట్రపతి పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి. గతంలోనే 50 డిగ్రీలు చదివేసిన ఈ డాక్టర్ తాజాగా మరో 11 కోర్సులు పూర్తి చేసి... మొత్తం 61 డిగ్రీలు, కోర్సులను తన ఖాతాలో వేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మానస హాస్పిటల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి-జూన్ సెమిస్టర్‌లో 11 ఎన్‌పీటెల్ కోర్సులు ఒకేసారి పూర్తిచేసినట్టు చెప్పారు. ఈ పరీక్షలన్నింటికీ స్థానిక రాజీవ్‌గాంధీ కాలేజినే సెంటర్ కావడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం రాలేదన్నారు. తన కోర్సులన్నీ శ్రమించి పరీక్షలు రాసి తెచ్చుకున్నవే తప్ప, హానరరీ డిగ్రీలో, ఫెలోషిప్ పదవి వల్లో వచ్చినవి కాదని స్పష్టం చేశారు.
Latest News