|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 11:22 AM
వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోపార్టీని బలోపేతం చేసి, రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లాను పార్టీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధ రెడ్డి అన్నారు. 29 అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మహిళలకు, యువతకు కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వైయస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కోసం అనునిత్యం కష్టపడుతున్న కార్యకర్తలు, నాయకులకు ఏ ఇబ్బందులు వచ్చినా పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అపద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనపై ఏడాది పాలనలోనే ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. హామీల అమలులో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. పార్లమెంటరీ పరిశీలకులు సురేష్ బాబు మాట్లాడుతూ.. 2029 లో వైయస్ జగన్ ను తిరిగి ముఖ్యమంత్రి గా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికిడిగా పనిచేయాలన్నారు. తంబల్లపల్లె ఎంఎల్ఏ పెద్దిరెడ్డి ద్వారక నాధ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెల్లి ఎండగట్టాలన్నారు.
Latest News