|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:44 PM
ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు భారతదేశానికి ఎంట్రీ ఇచ్చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మేలో ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళలో 95 కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 27 మంది డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో 44 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మొత్తం దేశ వ్యాప్తంగా 257 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చనిపోయారు.
Latest News