|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 02:40 PM
ప్రముఖ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ మంగళవారం తుది శ్వాస విడిచారు. భారత అణ్వాయుధ కార్యక్రమం రూపకల్పనలో డాక్టర్ హోమీ బాబాతో కలిసి పని చేసిన శ్రీనివాసన్, దేశ అణు శక్తి రంగంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
1959లో భారతదేశ తొలి అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శ్రీనివాసన్ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఆయన ఈ రంగంలో చేసిన విశేష కృషికి గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
శ్రీనివాసన్ మృతి పట్ల తమిళనాడు ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు భారత అణు శాస్త్ర రంగంలో శూన్యతను సృష్టిస్తుందని పలువురు ప్రముఖులు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.