|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:58 PM
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతుడుపాడు మండలంలోని నందనవనం, పాపిరెడ్డిపల్లి గ్రామాలలో మంగళవారం ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించకుండా ప్రభుత్వం కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను ఉపాధి కూలీలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూలీల గోడును గమనించి, వారి హక్కులను కాపాడాలని కోరారు.