|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:34 PM
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ రాత్రి పగలు తేడా లేకుండా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయ సహకార చర్యలు వేగవంతం చేయాలని, అవసరమైతే ఉద్యోగులు అల్లర్ట్ మోడ్‌లో ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఈదురు గాలులతో చెట్లు కూలిన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకు సమాచారం అందించేలా సమన్వయంతో పని చేయాలన్నారు. అవసరమైతే ఎమర్జెన్సీ సేవల్ని రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.