|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:16 PM
కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీఈఏపీసెట్-2025 ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ఏపీ, హైదరాబాద్‌లో ప్రశాంతంగా జరిగిందని ఏపీఈఏపీ సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వైస్‌చాన్సలర్ సీఎ్‌సఆర్కే ప్రసాద్ తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష సెట్ కోడ్‌ను వర్సిటీలోని ఈఏపీసెట్ కార్యాలయంలో విడుదల చేసి పరీక్ష నిర్వహణ తీరును కన్వీనర్ సుబ్బారావుతో కలిసి పరిశీలించారు. ఉదయం సెషన్‌లో 20,461 మంది విదార్థులకు 18,724 మంది హాజరయ్యారని,. మధ్యాహ్నం 20,456 మంది విదార్థులకు 18,931 మంది హాజరయ్యారని తెలిపారు. మొత్తం రెండు సెషన్లకు కలిపి 92.03 శాతం హాజరు నమోదైందని వీసీ తెలిపారు.
Latest News