|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 11:57 AM
విశాఖపట్నంలో వచ్చే నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దీని దృష్ట్యా వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఐదుగురు మంత్రులు.. నారా లోకేశ్, అనిత, సత్యకుమార్, కందుల దుర్గేష్, డోలా బాలవీరాంజనేయస్వామితో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలనశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబును నియమించింది. ప్రధాని పర్యటనకు అనుగుణంగా అన్నిశాఖలూ సమష్టిగా, సమన్వయంతో పని చేసేలా ఈ కమిటీ మార్గదర్శనం చేస్తుంది.
Latest News