|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 11:51 AM
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతపురం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానం నుంచి క్లాక్‌టవర్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ నిర్వహించిన ర్యాలీలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, ఎంఎస్ రాజు, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీశ్ జాతీయ జెండాలు చేతపట్టుకుని ముందు వరుసలో నిలిచారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు వారిని అనుసరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మన సైన్యం పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పిందని కొనియాడారు.
Latest News