కొత్త బట్టలు ఉతికినప్పుడు రంగు పోతోందా
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 11:56 PM

కొత్త బట్టలు కొనుక్కోవడం సంబరమే. కానీ అవి ఉతికేటప్పుడే భయం వేస్తూ ఉంటుంది. అందుకు కారణం..రంగు పోతుందని. ఇది అందరి ఇళ్లలో ఉండే సమస్యే. కొత్త చీర, షర్ట్, ప్యాంట్ ఇలా ఏదైనా సరే. అప్పటి వరకూ కలర్ ఫుల్ గా కనిపించిన డ్రెస్ లు ఉతకగానే చాలా డల్ గా అయిపోతాయి. రంగు అంతా పోతుంది. పైగా ఇప్పుడు చేతులతో ఉతికే వాళ్లు చాలా తక్కువ. సింపుల్ గా తీసుకెళ్లి వాషింగ్ మెషీన్ లో పడేసి స్విచ్ ఆన్ చేస్తే చాలు. గంటలో మురికి అంతా వదిలి ఫ్రెష్ గా మారిపోతాయి. అయితే..కొత్త డ్రెస్ లు కూడా అందులో వేసేస్తారు. అలా చేసినప్పుడు రంగు పోతుంది. ఇలాంటప్పుడు ఈ ఒక్క డ్రెస్ మాత్రమే కాదు.


ఈ కలర్ మిగతా దుస్తులకూ అంటి అన్నీ పాడైపోతాయి. పొరపాటున అందులో వైట్ కలర్ డ్రెస్ లు ఉన్నాయంటే రంగు అంటుతుంది. మళ్లీ వీటిని డ్రై వాష్ కి ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా ఓ తలనొప్పి. ఈ హెడెక్ తగ్గించుకోవాలంటే కొత్త డ్రెస్ ల కలర్ పోకుండా చూసుకోవాలి. అలాంటి చిట్కా ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో కనిపించింది. ఆమె చెప్పిన ఓ సింపుల్ టిప్ తో కొత్త బట్టల కలర్ పోకుండా చూసుకోవచ్చు. అదెలా ఫాలో అవ్వాలో చూడండి.


కలర్ పోకుండా


కొత్త డ్రెస్ లు కొన్నప్పుడు వాటిని చాలా మంది మెషీన్ లో వేస్తుంటారు. ముందు ఇది అవాయిడ్ చేయాలి. ఇలా మెషీన్ లో వేస్తే మిగతా దుస్తులు కూడా పాడైపోతాయి. అలా కాకుండా వీటిని ప్రత్యేకంగా వేరే బకెట్ లో ఉతుక్కోవాలి. అయితే ఇలా ప్రత్యేకంగా ఉతికినప్పుడు కూడా కలర్ పోతుంది. జస్ట్ మిగతా వాటికి అంటకుండా ఉండేందుకు మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ అసలు రంగు పోకూడదు, ఎలా ఉన్న దుస్తులు అలాగే ఉండాలంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే చిట్కా తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఒకే ఒక పదార్థం వేసి ఉతికితే చాలు. రంగు పోకుండా ఉండడంతో పాటు అవి ఎప్పుడూ కొత్తవిగానే ఉంటాయి.


ఏం చేయాలంటే


ముందుగా ఓ బకెట్ లో ఉతకడానికి సరిపడా నీళ్లు పోయాలి. ఆ తరవాత అందులో పటిక వేయాలి. నీళ్లు శుద్ధి చేయడానికి మన ముందు తరాల వాళ్లు ఈ పటికను ఎక్కువగా వాడే వాళ్లు. బిందెలు, కుండల్లో వేసి ఉంచే వాళ్లు. నీళ్లలో ఉన్న మలినాలను ఇది తొలగించేస్తుంది. జుట్టు, చర్మ సమస్యల్ని దూరం చేసే పటిక..దుస్తులకు రంగు పోకుండా కూడా కాపాడుతుంది. అందుకే నీళ్లలో ముందుగా పటిక వేయాలి. ఆ తరవాత మనం రోజూ వాడే ఉప్పు, లేదా కళ్లుప్పు వేసుకోవచ్చు. ఇవి నీళ్లలో కరిగేంత వరకూ చూడాలి. ఆ తరవాత కొత్త చీర లేదా డ్రెస్ ని బకెట్ లో వేయాలి. ఆ నీళ్లలో బాగా జాడించాలి. ఓ పావుగంట పాటు ఆ నీళ్లలోనే దుస్తులు ఉంచాలి.


తరవాత ఏం చేయాలి


ఈ నీళ్లలో కాసేపు నానబెట్టిన తరవాత శుభ్రంగా ఉతకాలి. ఇలా చేస్తే రంగు పోదు. అయితే సాధారణంగా బట్టలు ఉతికేటప్పుడు సబ్బు లేదా సర్ఫ్ వాడతారు. కానీ ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మాత్రం సబ్బుని కానీ సర్ఫ్ కానీ వాడకూడదు. పటిక, ఉప్పు వేసిన నీళ్లలో బట్టలు ఉతికినప్పుడు కేవలం ఆ నీళ్లతోనే సరిగ్గా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇంకేదీ అందులో యాడ్ చేయకూడదు. ఫస్ట్ టైమ్ ఉతికినప్పుడు ఇలా పాటించాలి. ఆ తరవాత ఓ రోజు ఆగి సబ్బు లేదా సర్ఫ్ తో ఉతుక్కోవచ్చు. అప్పుడు కలర్ పోవడానికి అవకాశం ఉండదు.


ఇవి కూడా ట్రై చేయండి


బట్టలు ఉతికే నీళ్లలో కాస్తంత వెనిగర్ వేయాలి. వెనిగర్ మొండి మరకలను పోగొడుతుంది. వెనిగర్ నీళ్లలో వేసి కొత్త డ్రెస్ లను అందులో నానబెట్టి కేవలం నీళ్లతోనే ఉతికితే చాలు. రంగు పోకుండా అలాగే ఉంటాయి. అయితే..ఇందుకోసం ఓ కప్పు వైట్ వెనిగర్ అవసరం అవుతుంది. దీంతో పాటు ఉప్పు కూడా వేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ ఉప్పు నీళ్లలో వేసి ఆ నీళ్లతో శుభ్రం చేసినా కలర్ పోకుండా ఉంటుంది. ఇక మరో చిట్కా ఏంటంటే..బట్టలను తిరగల తీసి ఉతికితే రంగు పోయేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ప్యాంట్ ని పూర్తిగా రివర్స్ తీసి ఉతకాలి. ఇలా మెషీన్ లో వేసినా ఆ కలర్ మిగతా వాటికి అంటకుండా ఉంటుంది.


వేరుగా ఉతకడం


కొత్త బట్టలు మొదటి సారి ఉతికినప్పుడు ఎక్కువ మొత్తంలో రంగు పోతుంది. ఆ తరవాత రెండు మూడు వాష్ ల వరకూ ఇలాగే అవుతుంది. అందుకే..కొత్త బట్టలు తెచ్చినప్పుడు వాటిని ఉతకాల్సి వస్తే మొదటి మూడు వాష్ ల వరకూ వాటిని సెపరేట్ గా పెట్టుకుంటే మంచిది. మిగతా దుస్తులు పాడవకుండా కాపాడుకోవచ్చు. ఇక కొత్త డ్రెస్ లను వేడి నీళ్లలో అసలు ఉతకకూడదు. ఇలా చేయడం వల్ల కలర్ పోయే అవకాశముంటుంది. సరైన డిటర్జెంట్ ఉపయోగించి చల్లటి నీళ్లలో ఉతికితే కొంత వరకూ సమస్య పరిష్కారమవుతుంది.

Latest News
Trump's tariffs threat over Greenland sparks EU pushback Sun, Jan 18, 2026, 10:57 AM
Assam residents welcome PM Modi's Kaziranga elevated corridor initiative Sun, Jan 18, 2026, 10:55 AM
97 pc of TN ration card holders receive Pongal gifts Sun, Jan 18, 2026, 10:49 AM
U19 World Cup: Malhotra leads stunning turnaround as India down Bangladesh by 18 runs Sun, Jan 18, 2026, 10:39 AM
Foreign maids under South Korean govt's pilot project overworked, underpaid: Survey Sat, Jan 17, 2026, 04:00 PM