నన్ను చంపాలని చూస్తున్నారు
 

by Suryaa Desk | Sat, May 17, 2025, 06:25 PM

ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కోమీ కుట్ర పన్నారని, ఇందుకోసం కోడ్ భాషలో బెదిరింపులకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపించారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జేమ్స్ కోమీ ఒక 'బ్యాడ్ కాప్' (చెడ్డ పోలీసు అధికారి) అని ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జేమ్స్ కోమీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో '86 47' అనే కోడ్‌ను పోస్ట్ చేసి, ఆ తర్వాత దానిని తొలగించారు. ఈ కోడ్‌కు "అమెరికా 47వ అధ్యక్షుడిని చంపడం" అనే అర్థం వస్తుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ, "ఆ కోడ్ అర్థం జేమ్స్ కోమీకి కచ్చితంగా తెలుసు. నన్ను హత్య చేయాలనేది అతని ఉద్దేశమని స్పష్టమవుతోంది. కోమీ సమర్థుడు కాకపోవచ్చు, కానీ ఆ కోడ్ అర్థం చేసుకునేంత తెలివి అతనికి ఉంది. దేశాధ్యక్షుడిని చంపాలని కోమీ పిలుపునిచ్చాడు" అని విమర్శించారు.అయితే, ఈ ఆరోపణలపై జేమ్స్ కోమీ స్పందించారు. తాను బీచ్‌లో షెల్స్ చిత్రాన్ని పోస్ట్ చేశానని, అధికారులు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ నంబర్లను హత్యలకు ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని, అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. 

Latest News
Iran to execute 26-year-old protester; family given just 10 minutes for final goodbye Wed, Jan 14, 2026, 03:22 PM
US launches more foreign strikes in Trump's first year than during Biden presidency: Survey Wed, Jan 14, 2026, 03:07 PM
2nd ODI: Nitish comes in for India as NZ opt to bowl first; Lennox handed debut Wed, Jan 14, 2026, 02:55 PM
Pakistan to host Australia for 3 T20Is from Jan 29 ahead of T20 WC Wed, Jan 14, 2026, 02:51 PM
MP 'honour killing': Man kills daughter for eloping with relative Wed, Jan 14, 2026, 02:45 PM