|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:20 PM
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు, 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబయిలోని ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు అతడి పేరును పెట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు రోహిత్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా రోహిత్‌ను ప్రశంసిస్తూ, ఓ సరదా వ్యాఖ్య చేశాడు.రోహిత్ శర్మ క్రికెట్‌లో సాధించిన విజయాలకు, ముఖ్యంగా ముంబయి జట్టుకు, భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించిందని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. "హేయ్ రోహిత్, వాంఖడేలోని ఈ స్టాండ్లలోకి నువ్వు ఎన్నో సిక్స్‌లు బాదావు. అందుకే ఈ రోజు నీ పేరు మీద ఒక స్టాండ్ వచ్చింది. నువ్వు దీనికి పూర్తిగా అర్హుడివి. నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇది చాలా అద్భుతమైన క్షణం. ఇదే మైదానంలో మళ్లీ మళ్లీ ఆడుతూ, రోహిత్ శర్మ స్టాండ్‌లోకి మరిన్ని సిక్స్‌లు కొట్టాలని కోరుకుంటున్నాను" అని ద్రావిడ్ తన సందేశంలో తెలిపాడు.
Latest News