|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:17 PM
ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఆ పార్టీ, ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో పెద్ద కుదుపునకు లోనైంది. పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసి, సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం దేశ రాజధాని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఈ 13 మంది కౌన్సిలర్లు, ముఖేష్ గోయెల్ నాయకత్వంలో 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించారు. రాజీనామా చేసిన వారిలో ముఖేష్ గోయెల్, హేమంచంద్ గోయెల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేశ్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిలో చాలా మంది గత మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినవారే కావడం గమనార్హం.
Latest News