|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 03:05 PM
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) శుక్రవారం ఒక కీలక ప్రకటన చేసింది. అమెరికా టెక్ దిగ్గజం జీఈ నుంచి ఇంజన్ల సరఫరా మొదలవడంతో, ఈ ఏడాది భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) 12 తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్‌సీఏ) ఎంకే1ఏలను అందించగలమని హెచ్‌ఏఎల్ ధీమా వ్యక్తం చేసింది. రాబోయే రెండు నెలల్లోనే తొలి యుద్ధ విమానాన్ని సిద్ధం చేస్తామని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. తేజస్ ఎల్‌సీఏ ఎంకే1ఏ అనేది హెచ్‌ఏఎల్ అభివృద్ధి చేసిన దేశీయ తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) తేజస్‌కు ఆధునిక రూపం. ఇది 4.5వ తరం బహుళ ప్రయోజన యుద్ధ విమానంగా రూపొందించబడింది. అత్యాధునిక పోరాట సామర్థ్యాలు, మెరుగైన మనుగడ, కార్యాచరణ దక్షత దీని ప్రత్యేకతలు.
Latest News