|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 03:02 PM
దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ తో ధీటుగా బదులిచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ పై తమ ఆటలు సాగవని పాకిస్థాన్ గ్రహించాలని, మన దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు. ఉగ్రవాదంపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించాడని, ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు , జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Latest News