|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:30 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షా పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసిన కేసులో ఐపీఎస్ అధికారి పీఎ్‌సఆర్ ఆంజనేయులుకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడు కాగా, పమిడికాల్వ మధుసూదన్ రెండో నిందితుడు. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వీరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సూర్యరావుపేట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పీఎ్‌సఆర్ తరపున న్యాయవాది విష్ణువర్థన్, ప్రాసిక్యూషన్ తరపున సిద్ధిఖ్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనల అనంతరం న్యాయాధికారి దేవిక... పీఎ్‌సఆర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పును చెప్పారు. మధుసూదన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి పోలీసులు గడువు కోరడంతో విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు.
Latest News