|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 01:16 PM
భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తన కెరీర్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్‌ను అధిగమించి చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ పోటీల్లో నీరజ్ 90.23 మీటర్ల దూరం జావెలిన్ విసిరి వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ అద్భుత విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ నీరజ్‌కు అభినందనలు తెలిపారు.
ప్రధాని మోదీ తన సందేశంలో, "నీరజ్ చోప్రా శ్రమ, పట్టుదల, అంకితభావానికి ఈ విజయం నిదర్శనం. అతడి ఈ ఘనత దేశానికి గర్వకారణం. నీరజ్ ప్రతిభ, క్రీడా స్ఫూర్తి యువతకు స్ఫూర్తినిస్తాయి" అని పేర్కొన్నారు. నీరజ్ ఈ ప్రదర్శనతో భారత క్రీడా రంగంలో మరో మైలురాయిని అందుకున్నాడు.