|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:57 AM
రాష్ట్రంలో ఏ మంచి జరిగిన తానే చేసినట్టు, ఏ చెడు జరిగినా దానికి వైయస్ జగనే కారణమని చెప్పడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. అయన మాట్లాడుతూ... ఇటీవల ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే టీడీపీ నాయకుడి హత్య జరిగితే, హడావిడిగా అక్కడకు వెళ్లిన చంద్రబాబు, వాస్తవాలు తెలుసుకోకుండా గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన పాపాలే హత్యకు కారణమంటూ మా పార్టీపై నిందలేసి చేతులు దులిపేసుకున్నాడు. తీరా చూస్తే వీరయ్య చౌదరిని సొంత పార్టీ నాయకులే హత్య చేశారని తేల్చిన పోలీసులు, నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పుడు టీడీపీ మరో కుట్ర చేస్తోంది. చివరి క్షణం వరకు పార్టీ కోసం పని చేసిన వీరయ్య చౌదరి కుటుంబాన్ని మోసం చేయడానికి వ్యూహ రచన చేస్తోంది. ఆ దిశలోనే, ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న తమ పార్టీ నాయకులను నిర్దోషులుగా విడిచిపెట్టే కుట్ర చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని కార్యకర్తలు కూడా గుర్తించడం వల్లనే వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్‌ను వారు అడ్డుకున్నారని జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు.
Latest News