|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 04:01 PM
ఫ్యాక్షన్ రాజకీయాలతో సతమతమవుతున్న అనంతపురం జిల్లాను పారిశ్రామికాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెట్టాలనుకున్న చంద్రబాబు. చాలా రాష్ట్రాలు పోటీ పడినా కూడా తన శక్తియుక్తులతో అనంతపురంలో కియా ప్లాంట్ ఏర్పాటయ్యేలా చేశారు. దాని ఫలితం... ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 536 ఎకరాల్లో ఉన్న ప్లాంట్.. ఏడాదికి 3 లక్షల కార్లని తయారు చేసి దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తోంది. తండ్రి తీసుకొచ్చిన కియా ప్లాంట్ తోనే అనంతపురం అభివృద్ధి ఆగిపోకూడదని భావించారు నారా లోకేష్. అందుకే ప్రపంచంలో పేరెన్నికగన్న రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ ను ఈ ప్రాంతానికే తీసుకువచ్చారు. ఈ ఎనర్జీ కాంప్లెక్స్ కోసం రెన్యూ... రూ.22000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. రాబోయేరోజుల్లో గ్రీన్ ఎనర్జీ రంగానికి చుక్కానిలా మారనుంది రెన్యూ. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. అభివృద్ధి అంటే ఇది... ఉద్యోక అవకాశాల కల్పన అంటే ఇది అంటున్న టీడీపీ శ్రేణులు
Latest News