|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 12:49 PM
సింధూ జలాల ఒప్పందం విషయంలో భారత్ తన దృఢనీలకే కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చర్యలు తీసుకోకపోతే, సింధూ జలాల ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం లేదని ఆయన హెచ్చరించారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన జై శంకర్, ఆ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను పాకిస్తాన్ భారత్‌కు అప్పగించాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. “వాళ్లను అప్పగించండి – నీళ్లు ఇస్తాం,” అంటూ కఠినంగా హెచ్చరించారు.
భారత్–పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి మూడో పార్టీ జోక్యం అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన, “ఈ విషయంలో మధ్యవర్తిత్వం అనవసరం. సమస్యలు ద్వైపాక్షికంగానే పరిష్కరించగలము,” అని పేర్కొన్నారు.
అలాగే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దిగి రావాలన్న సంకేతాన్ని భారత్ తన మాటలతోనే కాదు, తన చర్యల ద్వారానూ ఇస్తోందని స్పష్టమైంది.