|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 12:47 PM
ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన అనంతరం, రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో దేశ రక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అదనంగా రూ.50,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించనున్నట్టు సమాచారం.
ఈ నిధులను ప్రధానంగా రక్షణ బలగాల కోసం ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరికరాల కొనుగోలుకు వినియోగించనున్నారు. తాజాగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యుద్ధ సామగ్రి సమకూర్చడంపై కేంద్రం దృష్టి సారించింది.
ఈ బడ్జెట్ ప్రతిపాదనను రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించే అవకాశముంది. ఇప్పటికే 2024–25 వార్షిక కేంద్ర బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ రంగానికి కేటాయించిన కేంద్రం, అదనపు నిధులతో రక్షణ వ్యూహాలను మరింత పటిష్టంగా చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుతో దేశ రక్షణ రంగం మరింత అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.