|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 10:48 AM
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ...... గత వైయస్ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్‌పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైయస్ఆర్‌సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు అని అన్నారు.
Latest News