|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 10:22 AM
సింధూ జలాల నిలిపివేతపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకు సింధూ జలాల ఒప్పందం కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే పహల్గామ్ దాడి ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక భారత్–పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేని స్పష్టం చేశారు. కాల్పుల ఒప్పందం ఎవరు కొరుకున్నారో కూడా అందరికి తెలుసునన్నారు.మరోవైపు భారత్- పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. ఈనెల 10న డీజీఎంవోలు మధ్య కుదిరిన అవగాహనను అలాగే కొనసాగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు.
Latest News