భారతదేశంలో బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ పసిడి ధరలు గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి
 

by Suryaa Desk | Thu, May 15, 2025, 07:23 PM

భారతదేశంలో బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ పసిడి ధరలు గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి

భారతదేశంలో బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ పసిడి ధరలు గురువారం భారీగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఈ తగ్గుదలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్  వెల్లడించిన వివరాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,375 తగ్గి, రూ.93,859 నుంచి రూ.91,484కు చేరుకుంది. ఇదే తరహాలో, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.85,975 నుంచి రూ.83,799కు దిగివచ్చింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.70,394 నుంచి రూ.68,613కు తగ్గింది.కేవలం కొన్ని వారాల క్రితం, ఏప్రిల్ 22న 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు లక్ష రూపాయల మార్కుకు చేరువైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆకస్మిక తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఆశాజనకంగా మారింది.బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.2,297 తగ్గి, రూ.96,400 నుంచి రూ.94,103కు పడిపోయింది.ఈ పతనం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో జూన్ 5 నాటి గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గి రూ.91,325 వద్ద ట్రేడవ్వగా, జూలై 4 నాటి సిల్వర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు అంతే మొత్తంలో తగ్గి రూ.94,458 వద్ద ట్రేడయ్యాయి.అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వంటి ప్రపంచ పరిణామాలు బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి తగ్గినప్పుడు, బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర నెల కనిష్ఠానికి పడిపోయింది. కామెక్స్‌లో బంగారం ఔన్స్‌కు 1.1 శాతం తగ్గి 3,141.35 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఏప్రిల్ 22న నమోదైన 3,500 డాలర్ల గరిష్ఠ స్థాయి నుంచి గణనీయమైన తగ్గుదల.ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటం, ఇటీవల అక్షయ తృతీయ ముగియడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి కొనుగోళ్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Latest News
70-year-old arrested in Rajasthan CMO bomb threat case Mon, Aug 11, 2025, 04:11 PM
CM Siddaramaiah's close aide Minister Rajanna to be dropped over voter fraud statement: Sources Mon, Aug 11, 2025, 04:06 PM
RS clears two key bills amid Oppn boycott, paving way for tribal representation in Goa Assembly, maritime reform Mon, Aug 11, 2025, 04:04 PM
Giani Harpreet Singh elected Akali Dal breakaway faction's chief Mon, Aug 11, 2025, 04:02 PM
Maha CM should sack corrupt ministers and not succumb to pressure: Uddhav Thackeray Mon, Aug 11, 2025, 03:53 PM