నూనె చక్కెర మైదా లేకుండానే గులాబ్ జామూన్
 

by Suryaa Desk | Wed, May 14, 2025, 11:40 PM

గులాబ్ జామూన్ అంటే అందరికీ ఇష్టమే. అసలు ఆ పేరు చెబుతుంటూనే నోరూరిపోతుంది. పుట్టిన రోజులు, వేడుకలు, స్పెషల్ డేస్ ఏవి వచ్చినా కచ్చితంగా ఆ రోజు గులాబ్ జామూన్ ఉండాల్సిందే. ఇంకొందరైతే ఐస్ క్రీమ్ తెచ్చుకుని అందులో జామూన్ వేసుకిని తినేస్తారు. ఇలా తినడం చాలా మందికి ఇష్టం. అయితే గులాబ్ జామూన్ టేస్ట్ బాగానే ఉంటుంది. కానీ...ఇష్టం కదా అని ఎక్కువగా తినేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో అధిక మొత్తంలో నూనె, చక్కెర, మైదా ఉంటుంది. ఈ మూడు పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగించేవే. మితంగా తింటే పరవాలేదు. కానీ ఎక్కువగా తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటివి తలెత్తుతాయి.


ఇక షుగర్ బార్డర్ లో ఉన్న వాళ్లు పొరపాటున ఇది తింటే వెంటనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మైదా కూడా త్వరగా అరగదు. అలా అని తినడం మానేయలేం. అందుకే మనకి నచ్చినట్టుగా, ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయని విధంగా గులాబ్ జామూన్ తయారు చేసుకోవచ్చు. మంతెన సత్యనారాయణ చెప్పిన ఈ రెసెపీ ఫాలో అయిపోతే చాలు.


నూనె, చక్కర లేకుండానే


గులాబ్ జామూన్ అంటేనే నూనె, చక్కెర తప్పనిసరిగా ఉండాలి. జామూన్స్ సాఫ్ట్ గా రావాలంటే తప్పనిసరిగా నూనె వాడాలి. కొంత మంది నెయ్యి కూడా వాడతారు. ఇక స్వీట్ కాబట్టి కచ్చితంగా చక్కెర ఎక్కువ మొత్తంలో వేయాల్సిందే. కానీ ఈ రెండింటితో పని లేకుండానే గులాబ్ జామూన్స్ తయారు చేసుకోగలిగే రెసెపీ వివరించారు మంతెన సత్యనారాయణ. ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఈ వీడియో షేర్ చేశారు. మైదాతో కూడా అవసరం లేకుండా మృదువైన జామూన్స్ ఎలా తయారు చేసుకోవాలో వివరించారు.


కావాల్సిన పదార్థాలు


ఈ గులాబ్ జామూన్ తయారు చేసుకోడానికి చిలగడ దుంపలు అవసరం అవుతాయి. దీంతో పాటు పనీర్, మల్టీ గ్రెయిన్ ఆటా, బేకింగ్ సోడా తీసుకోవాలి. టేస్ట్ కోసం తప్పనిసరిగా యాలకుల పొడి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చక్కెర బదులుగా తేనె వాడాలి. నూనె బదులుగా వెన్న తీసుకోవాలి. కేవలం ఈ పదార్థాలతోనే చాలా సులభంగా గులాబ్ జామూన్ తయారు చేసుకోవచ్చు.


ఎలా తయారు చేసుకోవాలి


ముందుగా ఓ కడాయిలో నీళ్లు పోయాలి. అందులో మూడు లేదా నాలుగు స్వీట్ పొటాటో వేయాలి. అవి ఉడికేంత వరకూ వెయిట్ చేయాలి. అవి ఉడికిన తరవాత బయటకు తీసి పై పొట్టు లేకుండా శుభ్రంగా తీసేయాలి. తరవాత వాటిని స్మాష్ చేయాలి. అంటే పేస్ట్ గా మార్చుకోవాలి. ఓ కప్పులో పనీర్ తురుముని తీసుకుని ఈ స్వీట్ పొటాటో పేస్ట్ లో కలపాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తరవాత అందులో ఓ కప్పు మల్టీ గ్రెయిన్ పిండి వేయాలి. దీంతో పాటు ఓ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఓ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఓ స్పూన్ వెన్న వేయాలి. ఆ తరవాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.


తయారీ విధానం


తరవాత ఇలా చేయాలి


ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తరవాత అది ముద్దలా తయారవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని గులాబ్ జామూన్ షేప్ లో ఉండలుగా చుట్టాలి. ఆ తరవాత స్టవ్ పై పొంగనాలు చేసుకునే ప్యాన్ ని పెట్టాలి. అందులో ఈ ఉండలను ఉంచాలి. పైనా కాస్త వెన్న రాస్తూ వేడి చేయాలి. అవి గోధుమ రంగులోకి మారేంత వరకూ వాటిని వేడి చేస్తూ ఉండాలి. పూర్తిగా ఉడికిన తరవాత స్టవ్ పై నుంచి తీసేయాలి. తరవాత ఓ గిన్నెలో తేనె పోయాలి. ఓ కప్పు నీళ్లు పోసి కలపాలి. చక్కెర పాకం తయారు చేసుకున్నట్టుగానే దీన్ని పాకంలా తయారు చేసుకోవాలి. అలా మారేంత వరకూ వేడి చేయాలి.


తరవాత ఏం చేయాలంటే


ఈ పాకంలో అంతకు ముందు తయారు చేసి పెట్టుకున్న ఉండలను వేయాలి. కాసేపు మళ్లీ వేడి చేయాలి. పాకం వాటికి బాగా పట్టేంత వరకూ స్టవ్ పైనే ఉంచాలి. పాకం బాగా పట్టింది అనుకున్నాక పక్కన పెట్టాలి. కాసేపు చల్లారబెట్టిన తరవాత వీటిని తినొచ్చు. కాస్త రుచి కావాలంటే వీటిని ఓ కప్పులోకి తీసుకుని పైన తేనె పోసి తినొచ్చు. ఇందులో శరీరానికి హాని కలిగించే మైదా, నూనె, చక్కెర లేవు. చాలా సింపుల్ గా స్వీట్ పొటాటోతో తయారు చేసుకోవచ్చు. చిలగడ దుంపలు సహజంగానే తియగా ఉంటాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా జీర్ణమైపోతుంది. ఇక తేనెతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మల్టీగ్రెయిన్ పిండి చాలా సులభంగా అరిగిపోతుంది.

Latest News
Indian Army, NSUT join hands to develop AI-driven defence solutions Mon, Dec 22, 2025, 01:50 PM
'BJP emerging as credible alternative in TN; women seek safety, real empowerment': P Vijayalekshmi Mon, Dec 22, 2025, 01:49 PM
Nepal name 24-player group for training camp ahead of T20 WC Mon, Dec 22, 2025, 01:24 PM
Man arrested for harassing Bengali singer not affiliated to party, claims Trinamool Congress Mon, Dec 22, 2025, 01:21 PM
BJP emerges 'Big Brother' in Maha civic polls, but MahaYuti unity key for future success Mon, Dec 22, 2025, 01:15 PM