|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:44 PM
వడ్డెర్ల సంఘం ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రామగిరి, కనగానపల్లి మండలాల వడ్డెర నాయకులు పాల్గొని, తమ సమస్యలను తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేసి, కొండ క్వారీలలో, హిటాచి, జెసిబిలలో రాయితీలు కల్పించేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కుంచపు వడ్డే వెంకటేశులు మాట్లాడుతూ, వడ్డెర్లకు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.