|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:30 PM
భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురందేశ్వరి తెలిపారు. బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, దేశ ఆర్థిక రంగంలో వస్తున్న పాజిటివ్ మార్పుల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఇప్పటికీ దేశ జనాభాలో సుమారు 58 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే 70 శాతం మంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నారు” అని తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, అటువంటి చర్యల ద్వారానే గ్రామీణ భారతాన్ని ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని అన్నారు.
పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకుని రైతులకు మద్దతుగా నిలుస్తోందని, దీని ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు.