|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:09 PM
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ నూటికి 58 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. 70 శాతం మంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.‘‘కనీస మద్దతు ధరపై చట్టబద్ధత కష్టం. ఒకే పంటను వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పరిస్థితుల మధ్య పండించడమే దీనికి కారణం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. విత్తనాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం జీన్ బ్యాంకును ప్రారంభించింది. 100 వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.3 లక్షల రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం.
Latest News